నవతెలంగాణ-కంటేశ్వర్
ఎఐసిసి ఆదేశాల మేరకు పిసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ భవన్ నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి అక్కడి నుండి పులాంగ్ వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛను అందించి తమ హక్కులను పరిరక్షించుకునే విధంగా, ప్రతి ఒక్క భారతీయుడు సమానమే అనే విధంగా స్వేచ్ఛ స్వాతంత్ర సమానత్వపు హక్కులను కల్పించిన రోజు అని, హిందువులకు భగవద్గీత ముస్లింలకు క్రైస్తవులకు వారి మత గ్రంథాలు ఎంత పవిత్రమైనవో భారతదేశ పౌరులకు రాజ్యాంగం అనేది అంతే పవిత్రమైనదని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు అందరూ కలిసి భారత దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అన్ని కులాల వారు అభివృద్ధి చెందడానికి రాజ్యాంగాన్ని పొందించడం జరిగిందని, 26 నవంబర్ 1949న, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, అదేవిధంగా నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జాతీయ న్యాయవాద దినోత్సవంగా జరుపుకునే విధంగా సుప్రీంకోర్టులో 1979లో ఆమోదించారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారత రాజ్యాంగ దినోత్సవం యొక్క విలువలను అనుసరిస్తూ ఆచరిస్తూ రాబోయే తరాల వారికి వాటి విలువలను వివరించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ పిసిసి కార్యదర్శులు రాంభూపాల్, రామకృష్ణ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, మాజీ పిసిసి డెలిగేట్ ఈసా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తంబాకు చంద్రకళ, పోలో ఉష, కార్యదర్శి కోనేరు విజయలక్ష్మి, ప్రభా గండ కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేశ మహేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు ఆషాబి, మలైక బేగం, కార్పొరేటర్ గడుగు రోహిత్, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, కైసర్, ప్రమోద్, అవీన్, శోభన్, అయ్యుబ్, నవాజ్, వహీద్, విశాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:31PM