- నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్
నవతెలంగాణ-కంటేశ్వర్
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలని ఏ.సి.పి వెంకటేశ్వర్ అన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రోడ్లపై దీనావస్థలో కదలలేని స్థితిలో ఉన్న వృద్దులు మతిస్థిమితం లేని ఆనామకులను గుర్తిస్తు వారికి ఊటలు కట్టిన జుట్టు, పెరిగిపోయిన గోర్లు, పిడుచలు కట్టుకుపొయిన బట్టలు తోలగించి సపర్య సేవలు చేసి తిరీగి వారికి స్నానం చేపించి కోత్త బట్టలు తొడిగి స్వేటర్లు, దుప్పట్లు, ప్లేట్లు గ్లాసులు ఆహరం అందించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఏ.సి.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సేవ కార్యక్రమాలు అందరికి స్పుర్తిగా నిలుస్తున్నాయన్నారు. మలమూత్రాలమద్య కదలలేని స్థితిలో ఉన్న వృద్దులని మతిస్థిమితం లేని వారికి సేవలు చేయటం అభినందనీయమన్నారు. అనంతరం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చేస్తున్న సేవలను స్దానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు పసునూరి వినయ్ కుమార్, సూజాత సూర్యరాజ్, సూజాత, శ్రీలత, అపర్ణ, సూజాతరెడ్డి, సునీత, పృథ్విరాజ్ పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:38PM