- బిఎల్ టియు రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ-కంటేశ్వర్
స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలతో నిర్మాణమైన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఒక్కొక్కటిగా కాలరాస్తుందని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ టీయు రాష్ట్ర అద్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. రాజ్యాంగ ఆదేశీత సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో ఉండాల్సి ఉంటే బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదాని లాంటి ఉత్తపెట్టుబడిదార్లకు కారు చౌవకగా అప్పగించడం మూలంగా లక్షలాది పరిశ్రమలు మూతపడి కోట్లాది మంది కార్మిక, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని వెల్లడించారు.
ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బిఎల్ఎఫ్ కార్యాలయం వద్ద 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లోకెళ్ళ అత్యంత ప్రజాస్వామ్యయుత ప్రజాస్వామ్య దేశం భారత దేశమని అలాంటి ప్రజా గణతంత్ర రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం ఆధారయుత ఫాసిస్టులపాలనలో ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా దళిత బహుజన,ప్రజాస్వామ్య శక్తులు ఐక్య కార్యాచరణ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ బిఎల్ టీయూ జిల్లా అద్యక్షులు కె.మధు, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, శ్రామిక బహుజన మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశబాయి, నగర ప్రధాన కార్యదర్శి గంగశంకర్, కృష్ణ, సురేఖ బాయి, ఎల్.గోపినాథ్, బిఎల్ పి నగర కన్వీనర్ హైమ హుస్సేన్, బిఎల్ టియు నాయకులు అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:43PM