- కాటాపూర్ పి హెచ్ సి ని ఆకస్మిక తనిఖీ
- కాటాపూర్ పీహెచ్సీ లో షుగర్ టెస్ట్ చేయించుకున్న కలెక్టర్
నవతెలంగాణ-తాడ్వాయి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వ వైద్యం, వైద్యుల పట్ల నమ్మకం కల్గించేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మతో కలిసి మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈనెల గర్భిణీ స్త్రీలు ఎంతమంది కాన్పు కోసము ఉన్నారో వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఆసుపత్రులలో ప్రసవాలు గురించి ఆరా తీశారు.
ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఆస్పత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకప్ చేశారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అత్యవసర మందులు నిల్వలు సరిగా మైంటైన్ చేయాలని, అలాగే కుక్క కాటు, పాము కాటు మందులు ఎల్లప్పుడు ఉంచుకోవాలని ఫార్మసిస్టును ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పిహెచ్ సీలో షుగర్ చెక్ చెయించుకున్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆసుపత్రికి ప్రహరీ గోడ ఏర్పాటు కోసము, త్రాగునీరు సౌకర్యం బోరు ఏర్పాటు కోసం కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సమ్మయ్య హెచ్ ఇ ఓ, శివరంజని ఫార్మసిస్టు, స్టాఫ్ నర్స్ శ్రీలేఖ, శ్రీధర్ ఎల్ టి విధులలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:48PM