నవతెలంగాణ-నవీపేట్
రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ విముక్త సంచార జాతుల సంఘం (డిఎన్టి) జిల్లా అధ్యక్షులు జాదవ్ శరత్ ఆధ్వర్యంలో సంచార కులాల పేర్లు తిట్టు పదాలుగా ఉన్నందున అట్రాసిటీ హక్కు చట్టం కల్పించాలని తహసిల్దార్ వీర్ సింగ్, ఎంపీడీవో సాజిద్ అలీలకు శనివారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డిఎన్టి జిల్లా అధ్యక్షులు జాదవ్ శరత్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో సైతం సంచార జాతి కులాలకు ఇప్పటికే రేషన్, ఆధార్, ఓటర్ కార్డులతో పాటు పుట్టిన తేదీ మరియు కుల ధ్రువీకరణ పత్రాలు లేక దారిద్రపు జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. కావున సంచరుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. విముక్త, సంచార, అర్ధ సంచార జాతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన శ్రీ దాదా ఇదాతే కమిషన్ సిఫారసులను ఆమోదించి డిఎన్టి కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరారు. అలాగే సంచార జాతి కులాల పేర్లు తిట్టు పదాలుగా వాడుతున్నందున అట్రాసిటీ చట్టం హక్కులను కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం సంచార జాతి బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ పరిరక్షణ కమిటీ జిల్లా నాయకులు శివశంకర్, ఓడ్ కులస్తులు బాలాజీ, అజయ్, సంబాజీ, కైకడి కులస్తులు మురళి, సుశీల, లలిత, గిసాడి కులస్తులు బాలాజీ, వడ్డెర శివ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 04:58PM