- పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి
తెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను రైతులు పొందాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో
మరియు చల్వాయి గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడవకుండా పరదాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు త్రాగునీటి సౌకర్యం ఎండ నుండి తట్టుకునేందుకు షెడ్డు చేయడం జరిగిందన్నారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రంలోకి తరలించి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ధాన్యం శుభ్రపరచుకోవడానికి అవసరమైన ప్యాడి క్లీనర్లను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి సర్పంచు ముద్దబోయిన రాము సంఘము డైరెక్టర్ శ్యామల జ్యోతి మరియు సప్పిడి అదిరెడ్డి కోమటిరెడ్డి సమ్మిరెడ్డి మరియు రైతు సంఘము సభ్యులు వార్డు మెంబర్స్ అగ్రికల్చర్ అధికారులు మరియు ప్రజా నాయకులు రైతులు హమళీలు.మరియు సంఘము సి ఈ ఓ సంఘము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 05:08PM