- జంపాల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటిసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని చల్వాయి గ్రామంలో బొమ్మనవేని ఓదెలు అధ్యక్షతన జరిగిన హమాలీ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ హాజరైన సందర్భంలో మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేసి కార్మికులందరికీ పని భద్రత, కనీస వేతనాలు, మఅందించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను, కార్మిక వర్గం ఏకమై ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలు నిర్వహించాలనే లక్ష్యంతో, ఈనెల 27వ తేదీన యాదగిరిగుట్టలో జరిగే ఏఐటీయూసీ బహిరంగ సభను కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని, అలాగే 28, 29వ తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే మహాసభలను ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వడి సారయ్య, పెద్దాపురం ఓదెలు, అట్లూరి శ్రీనివాసరావు, కొండ కుమార్, శంకర్, కందికొండ లింగయ్య, శ్రీనివాస్, తాటి కృష్ణ కారపాటి యాదగిరి, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 05:11PM