నవతెలంగాణ-నవీపేట్
మండలంలోని అబ్బాపూర్(బి) తండాలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఎంపీడీవో సాజిద్ అలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 18 సంవత్సరాల నిండిన 30 మంది ఓటర్లను గుర్తించి నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇర్నాల స్వామి, శోభన్, కార్యదర్శి హైదర్ పాష, బి ఎల్ ఓ అనిత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm