నవతెలంగాణ-గోవిందరావుపేట
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవంలో అద్భుతమైన కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పెండేల విజయం ఉపాధ్యాయులు అభినందించారు. శనివారం మండలంలోని చల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు చెందిన విజయ్ ములుగు జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీల్లో పిట్టలదొర ఏకపాత్రాభినయం ప్రదర్శించి సోలో డ్రామా అంశంలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. పోటీల్లో అద్భుతంగా రాణించిన విజయాన్ని ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రథమ స్థానంలో రావాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మొలుగూరి రమేష్, ఉప్పుతల ప్రసాద్, దామరాజు సమ్మయ్య, చల్లగురుగుల మల్లయ్య, బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి, అందె రమాదేవి, భూక్య సరిత, సుతారి మురళీధర్, ముడుంబ వెంకట రమణమూర్తి, రాయబారపు దీప్తి, కొత్త వెంకటేశ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm