నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కారం కోసం పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పసర గ్రామం లో పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించినారు. ఈ తరగతులకు ముఖ్యఅతిథిగా సూడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం 2005 చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం గ్రామ సర్వేలు చేసి గ్రామసభలు నిర్వహించి ఏ గ్రామంలో కూడా హక్కు పత్రాలు రాకుండా శాటిలైట్ పేరుతో ఫారెస్ట్ అధికారులు ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచి నారని పేర్కొన్నారు.
గ్రామాలకు గ్రామాలే ఒక్క దరఖాస్తులను కూడా హక్కు పత్రాలు రాలేదని కాస్తు కబ్జాలో ఉన్న వారందరికీ వాస్తవంగా హక్కు పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలని కేవలం ఆదాని, అంబానికి ఇద్దరికీ కారు చౌకగా కట్టబెట్టి ప్రపంచ కుబేర్ల స్థానానికి వీరిద్దరిని పంపించిందని దేశంలో ప్రజల పరిస్థితి మాత్రం దిగజారి పోయిందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని ప్రభుత్వ విధానాలు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివరించి స్థానిక సమస్య తీసుకొని ప్రజా ఉద్యమాలు క్షేత్రస్థాయిలో నిర్మించాలని గ్రామ గ్రామాన కమిటీ శాఖలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, దుగ్గి చిరంజీవి పొదిల్లా చిట్టిబాబు, గొంది రాజేష్ అంబాల పోశాలు, మురళి, కడారి నాగరాజు, సామ చంద్రారెడ్డి, సప్పిడి యాదిరెడ్డి, గుండు రామస్వామి, చింతల రఘుపతి, అల్లెం అశోక్, కోరం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 05:34PM