- గుమ్మడి రాజుల రాములు
నవతెలంగాణ-ధర్మసాగర్
ఉపాధి హామీలో గత మూడు నెలలుగా వాచర్ వర్కర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిలుక రాఘవులు ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేదలైన వారికోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులలో అవకతవకలను వెంటనే సరిచేసి ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇవ్వాలని కోరారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యవర్గాన్ని వారి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా చిలుక రాఘవులు, అధ్యక్షురాలుగా ఆరూరి భాగ్య, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా కే సుహాసిని, సత్తమ్మ, రజిత, రఘు, అరుణ, మణెమ్మ, సుగుణ, చిన్నక్క, మమత, అంజి, సారమ్మ, లక్ష్మి, ప్రమీల, రాజయ్య, ఎస్ ప్రమీల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 05:38PM