నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర పంచాయతీ నేతాజీ నగర్ గ్రామంలో శనివారం మంజునాథ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ముద్దబోయిన రాము లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాము మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారం శుభ్రపరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహిస్తున్న మహిళ సంఘాల సభ్యులు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అబద్ధం ఎల్లారెడ్డి ఏపీఎం నాగేశ్వరరావు డిపిఎం చౌహన్ సంఘం అధ్యక్షురాలు ముద్రబోయిన రమాదేవి కార్యదర్శి టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm