నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని జంగాల, చీలాపూర్ గ్రామ ఊర చెరువు మత్తడి మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం శంకుస్థాపన చేశారు. జంగాల చెరువు మత్తడి వర్షాల వరద ఉదృతికి గత ఏడాది క్రితం ధ్వంసమైంది. మత్తడి మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడంతో నర్సింహుల పల్లి గ్రామ ప్రజలు గత ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాకపోకలకు మార్గం సుగమవ్వనుంది. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, ఎఎంసీ చైర్మన్ రాజయ్య, మండలాద్యక్షుడు మహిపాల్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాద్యక్షులు సంజీవ రెడ్డి , రాజ మహేందర్ రెడ్డి, అయా గ్రామాల సర్పంచులు కసుంబ అంజవ్వ, రాగుల మొండయ్య, పెంటమీదీ శ్రీనివాస్, కవ్వ లింగారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ దీటీ బాలనర్స్, అయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.