నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని మేడారంలోని ఆదివాసి మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవి ఆధ్వర్యంలో శనివారం 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దీపికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కురుసం రవి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, అలాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత డా.బీఆర్ అంబేడ్కర్‌కే దక్కుతుందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ ఆశయసాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm