నవతెలంగాణ-ఏర్గట్ల
మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల సెక్రటరీ గడ్డం మోహన్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వేముల టిఆర్ఎస్ కండువా కప్పి అతన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గడ్డం మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూర్ణానందం, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, బోనగిరి రమేష్, ఏనుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm