- ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఉషారాణి
నవతెలంగాణ-ఏర్గట్ల
రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉపయోగించుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఉషారాణి అన్నారు. శనివారం ఆమె తొర్తి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలను సందర్శించి, గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోర్టిఫైడ్ బియ్యానికి అదనంగా విటమిన్లు, ఖనిజాలను జోడించి రైస్ పోర్టిఫికేషన్ చేస్తారని, ఇందులో బి 12,ఫోలిక్ యాసిడ్, అయోడిన్, జింక్ తదితర విటమిన్లతో కూడిన పదార్థాలు వంద కేజీలకు ఒక కేజీ కలుపబడుతుందన్నారు. పౌష్టికాహార లోపం ఉండకూడదనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, శైలజ, లక్ష్మి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm