నవతెలంగాణ-ఏర్గట్ల
మండలంలోని నాగేంద్రనగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్, ఉపసర్పంచ్ కుర్మ శేఖర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయునికి సూచించారు. అనంతరం సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ విద్యార్థుల మధ్య కూర్చొని సహా పంక్తి భోజనం చేశారు. ఇందులోభాగంగా పంచాయతీ కార్యదర్శి సంధ్య, కారోబార్ జనార్ధన్, గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm