- నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్
నవతెలంగాణ-కంటేశ్వర్
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా ఈ రోజు నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో గల విగ్రహానికి పోలీస్ కమిషనర్ నాగరాజు ఎస్సి సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ వేసి నివాళులు అర్పించారు. మాల మహానాడు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీస్ కమిషనర్ నాగరాజు తో కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో భాతర రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించాలని రాజ్యాంగ పఠనం చేసే విధంగా అన్ని సంఘాల వారు యువకులను, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అనంపల్లి ఎల్లయ్య, టిఎన్జీవోస్ అధ్యక్షులు అలుక కిషన్, నాయకులు దండు చంద్రశేఖర్, తెరాస ఎస్సి సెల్ అధ్యక్షులు నీలగిరి రాజు, ఎడ్ల నాగరాజు, నాంది వినయ్, వి.ఆర్.ఎ సంఘం అధ్యక్షులు పులి దయాసాగర్, ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు సుధాకర్, ఎస్సి సంఘాల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 05:57PM