- జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కంటేశ్వర్
జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని కులం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలవేసి శనివారం సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన 15 రోజులకే రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయులు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీలే కాదు ఎస్సీలు ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రతి ఒక్క వర్గానికి రాజ్యాంగం సమానమైనటువంటి రూపకల్పన చేయడం జరిగింది. అంబేద్కర్ ఒక అడుగుజాడలో ప్రతి ఒక్క విద్యార్థి యువకులు నడిచినప్పుడే భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పరమేష్ సంతోష్ సతీష్ కిషోర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:00PM