- సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగానాయక్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ అధికారులు ప్రతి పనిలోనూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగనాయక్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ముందుగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళులు అర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ గ్రామ సభలో ప్రతి సభ్యులు ప్రజలు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబుదారీతనంగా సమాధానాలు చెప్పాలని అన్నారు. సభలో ప్రజా సమస్యలను వారిని సభ్యులు ప్రజలు వారి అవగాహన మేరకు ప్రశ్నించడం సహజం అన్నారు. అలాంటి సమయంలో శాంతియుతంగా అధికారులు సమాధానాలను ఇవ్వడంతో పాటు అవసరమైతే సమయం కూడా కోరవచ్చు అన్నారు. అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు మరియు వ్యవసాయ శాఖ ఆరోగ్య శఖ అధికారుల సమాధానాలతో ప్రజలు కొన్ని అంశాలను సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు ఉప సర్పంచ్ అల్లం నేని హనుమంతరావు వార్డు సభ్యులు తుమ్మల శివ అజ్మీర స్వరూప పులుసం లక్ష్మి శ్రావణ్ గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:03PM