- మాదిగ ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కంటేశ్వర్
టేనిజామాబాదు పట్టణం లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద మహనీయులు భారతరత్న, డాక్టర్ భీమ్ రావు అంబెడ్కర్ కి పూలమాలంకారణ చేసి రాజ్యాంగ దినోత్సవం మాదిగ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి అధ్యక్షులు గుడ్ల రాములు మాదిగ, ప్రధాన కార్యదర్శి కేశపురం రమేష్ మాదిగ మాట్లాడుతూ అంబెడ్కర్ ఎన్నో ఏళ్లు శ్రమించి, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన భారత రాజ్యాంగం రచించి 1949, నవంబర్ 26న ఆమోదం పొందడం జరిగిందని, రాజ్యాంగ పీఠకలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో, దేశ ప్రజలంతా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వంతో కల్సి ఉండాలి అని ఆకాంక్షించి, జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీఓసి లకు రిజర్వేషన్స్ అందించిన మహనీయులు అంబెడ్కర్ అన్నారు.
అదేవిదంగా 2% మాత్రమే ఉన్న వారికి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చినందున, 18%ఉన్న ఎస్సీ లకు 20% రిజర్వేషన్స్ కల్పించాలని, కొందరు రాజ్యాంగం మారుస్తామని పగటి కలలు కంటున్నావారని, ఆ ఆలోచన మానుకోవాలి అని, రాజ్యాంగం మార్చడం అంటే అంబెడ్కర్ని అవమానించడమే అవుతుందని, రాజ్యాంగం మార్చాలని చూస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ లు ఏకమై అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాదిగ ఉద్యోగుల డవిశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు జి. మహేష్, గౌరవ సలహాదారులు జి. గంగారాం, సిద్దిరాములు, వినోద్ కుమార్, గంగాధర్, శేషరావు, దుర్గయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి. బాబా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె. గంగయ్య, కోశాధికారి కె. గంగాధర్, రాజగాగన్, భూషణ్, వినోద్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:07PM