నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయం పాఠశాలలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు నవంబర్ 26 ను విద్యార్థుల మధ్య సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అంబేద్కర్ చిత్రపటానికి పూళమాలు వేసి మాట్లాడుతూ విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల ప్రక్రియ కోసం అవగాహన సదస్సులు ఎన్నికలు జరిగే విధి విధానాలపై కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm