- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్య కార్పోరేటీకరణ,వ్యాపారీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్.ఎఫ్.ఐ మాజీ నాయకులు పిట్టల అర్జున్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక వికెవిడిఎస్ రాజు కళాశాలలో శనివారం ఎస్.ఎఫ్.ఐ అశ్వారావుపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ అధ్యక్షతన నూతన జాతీయ విద్యా విధానం-ఓ పరిశీలన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ప్రధాన వక్తగా పిట్టల అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత విద్యా, ఉపాధి కోసం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళపై అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేసి ఆయా సమస్యలపై పరిష్కారం చేసే వరకు ఉద్యమిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా రంగాన్ని గాలికొదిలేశాయనీ, ప్రైవేటు శక్తులకు పాలక వర్గాలు కొమ్ముకాస్తున్నాయన్నారు. పాఠశాల విద్యలో, ఉన్నత విద్యలో, ఉపాధ్యాయ విద్యలో, వృత్తి విద్యలో అనేక విద్యార్థి వ్యతిరేక ప్రతిపాదనలు చేశారనీ, ఈ విద్యా విధానం సమాజ గమనాన్ని తిరోగమింపజేస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కనీస నిధులు కేటాయించకుండా నూతన విద్యా విధానం ఎలా అమలు చేస్తారనీ అన్నారు. ఈ విద్యా విధానం అట్టడుగు వర్గాల రిజర్వేషన్లపై, రీయింబర్స్మెంట్ పై పరోక్ష దాడి చేస్తుందన్నారు. పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్ లలో కోత విధిస్తున్నారనీ, మైనారిటీ పరిశోధక విద్యార్థులకిచ్చే ఫెలోషిప్ లలో గణనీయంగా కోత విధిస్తున్నారనీ అన్నారు. విద్యార్థుల మెదళ్ళలో మత ఛాందస భావాజాలాన్ని చొప్పించేందుకు ఈ విద్యా విధానాన్ని పావుగా వాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:14PM