నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నాగారంలో గల తెలంగాణ గురుకుల గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు నెహ్రూ యూత్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, క్విజ్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొన్నారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు నెహ్రూ యూత్ కేంద్రం డిస్టిక్ యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మేమంటో, సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐదవ టౌన్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ హాజరయ్యారు. రాజ్యాంగ నియమ నిబంధనలు హక్కులు విధులు వివరించారు. కళాశాల విద్యార్థులకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చినట్టు కళాశాల ప్రిన్సిపాల్ సైద జైనబ్ మేడం తెలియజేశారు. ఈ కార్యక్రమన్ని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఫైజియా ఫాతిమా, బి బి ఏ డిపార్ట్మెంట్ సంధ్యారాణి సుప్రియ వరలక్ష్మి ఆర్గనైజేషన్ చేశారు. ఈ కార్యక్రమలో విద్యార్థులు అధ్యాపకులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:19PM