నవతెలంగాణ-భిక్కనూర్
పరీక్షల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రయివేటుపాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంజయ్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని పాఠశాలలో పరీక్షల పేరున అధిక డబ్బులు విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారని, పాఠశాలకు చెందిన బస్సులను మండల కేంద్రంలో అతివేగంగా నడుపుతున్నారని తెలిపారు. తక్షణమే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల విద్యాధికారి కార్యలయంలో ఎంఈఓ లెకపొవడంతో సిబ్బంది పాపయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మండల కన్వీనర్ సమీర్ ఖాన్, కో కన్వీనర్ దత్తాత్రేయ, కళాశాల అధ్యక్షులు అజయ్, నాయకులు సందీప్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:50PM