నవతెలంగాణ-కంటేశ్వర్
73వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్భంగా పోలీస్ శాఖ ఆద్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్.నాగరాజు, ఐ.పి.యస్ భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది.ముందుగా డా॥ బి.ఆర్. అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కే అర్ నాగరాజు మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను చూసి భారత రాజ్యాంగంను తయారు చేయడం జరిగిందని, అట్టి స్వేచ్చ, ఫలాలను ప్రస్తుతం మనం అనుభవిస్తున్నామని, భారత రాజ్యాంగం అన్ని కులాల వారుకి ఎంతో ఉపయోగపడుతుందని, రచనా సంఘం రెండు సవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 141 సార్లు చర్చలు, సమావేశాలు జరిపి మరీ రాజ్యాంగ పీఠికకు, 395అధికరణాలు ఎనిమిది షెడ్యూలకు తుది రూపునిచ్చింది. గత 73 సంవత్సరాలలో భారత రాజ్యాంగం అనేక మార్పుచేర్పులకులోనై విస్తరించింది. ప్రజల హక్కులు, విధుల గురించి క్షుణ్ణంగా వివరించడ జరిగిందని, భావితరాలకు మన రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, ఎ.సి.పి ఎ.ఆర్. సంతోష్ కుమార్, ఎ.సి.పి ,సి.సి.ఎస్ రమేష్, పోలీస్ కార్యాలయం (ఎ.ఓ) రామారావు, రిజర్వు ఇన్స్పెక్టర్స్ అనిల్ కుమార్, అప్పలనాయుడు, సి.పి ఆఫీస్ కార్యాలయం సిబ్బంది ఎ.ఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:55PM