నవతెలంగాణ-భిక్కనూర్
భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పై తగు చర్యలు తీసుకోవాలని బిడిఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు. శనివారం పాఠశాల వద్ద ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గల ఉన్నత పాఠశాలకు వెళ్లడం జరిగిందని, పాఠశాలలోకి ఎవరు రావద్దని ఎలాంటి ప్రసంగాలు చేయవద్దని పాఠశాల హెచ్ఎం శైలజ చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం గురించి చెప్పడానికి వీల్లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm