నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
ప్రతి విద్యార్థికి భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కసరత్తు అనంతరం రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యసభలో ఆమోదించారని ఆ రోజునే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సార్వభౌమత్వానికి తూట్లు పొడిచే విధంగా ఆత్మ నిర్బర భారత్ అనే అందమైన నినాదాలు ఇస్తున్న మోడీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు తలుపులు బారుల తెరిచి సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. సామాన్య వాద, లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ మనువాద సిద్ధాంతం తేవడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి పాఠశాల గ్రంథాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, ప్రతి విద్యార్థికి రాజ్యాంగం పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పాలకులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వై.ఓమయ్య, ఎండి. రఫిక్ ఖాన్, హనుమాన్లు, గంగాసాగర్, గంగాధర్, ఆనంద్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 06:59PM