నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
అడవికి రక్షణ ఆదివాసులేనని అడవుల నుండి గిరిజన తెగలను ఎల్లగొట్టే కుట్రల ను ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాసులను అడవికి దూరం చేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర లో భాగంగా అడవుల రక్షణ నియమాల పేరుతో బిల్లు తీసుకువచ్చే కుట్రను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల ఎస్కేయం పిలుపులో భాగంగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకొని ముందస్తు అరెస్టులు అన్యాయం అన్నారు. శనివారం చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని వెళ్లకుండా అడ్డుకోవడానికి శుక్రవారం నిజామాబాద్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి గృహ నిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల ఎస్కేయం పిలుపులో భాగంగా రాజ్ భవన్ కి వెళ్లి దేశంలో దాదాపు 700 గిరిజన తెగల జీవన మరణ సమస్యలను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనీసం మెమోరండం ఇచ్చే స్వేచ్ఛ లేకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. శాశ్వత పరిష్కారం చూపే అటవీ హక్కుల చట్టాలను పకడ్బందీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని హితువు పలికారు. శుక్రవారం రోజు అర్ధరాత్రి అరెస్టు చేసిన రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బి.దేవరాం, పి.రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్. సాయ గౌడ్ లను బేసరతు గా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:02PM