- రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ-డిచ్ పల్లి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరిగే కార్యక్రమం, ఆ తర్వాత వారం రోజులపాటు జరిగే కార్యక్రమం పై శనివారం ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మండల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కేంద్రంలో పెద్ద మొత్తంలో వికలాంగుల దినోత్సవం జరపాలని దానికి వివిధ నాయకులు దాతలను సంప్రదించి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు నిజామాబాద్ రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈసారి స్పందించి అంతర్గత అధికారుల ఉత్సవాన్ని అధికారిక జరపడానికి నిర్ణయించిందని, అయినప్పటికీ అది పెద్ద మొత్తంలో కాకుండా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో మాత్రమే చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రానికి, రాజధాని కి వికలాంగులం వెళ్లలేం కాబట్టి ప్రతి మండలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుండేది దాని వివారించారు. ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమాన్ని మండలాల వారిగా నిర్వహించి అందరూ వికలాంగులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల దినోత్సవం జరపడమే కాకుండా మాకు ఉన్న హక్కులు చట్టాలని కఠినంగా అమలుపరిచి ఆర్థికంగా ప్రభుత్వం అన్ని విధాల అండదండలుగా ఉండాలని వారు కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల అధ్యక్షులు ఎరుగు శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు కుమ్మరి జమున, పోసాని, కుంట జమున, చిన్నమ్మి, అంకం గంగాధర్, ఇమ్మడి సాయిలు ప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:16PM