నవతెలంగాణ-ధర్మసాగర్
ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మునిగేల రాజు అన్నారు. మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ బానిసత్వం, రాచరిక వ్యవస్థ, అసమానతలకు సంకెళ్లు తెంచి స్వేచ్ఛ, సమానత్వం సంపూర్ణ లౌకిక రాజ్యంగా భారత దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొన ఆడారు. ఎం ఎస్ పి పార్టీ జిల్లా కో ఇంచార్జి గంగారపు శ్రీనివాస్ మాట్లాడుతూ అంబెడ్కర్ మహనీయుడు మన భారత దేశానికి దిశ దశ ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా మన దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆకారపు అన్నమ్మ, మునిగాల యాకోబు, కలకోట అనిల్, నాయకులు బొడ్డు భరత్, మాచర్ల బాబు.చిలుక రాజు,బొంద్దుగుల దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:19PM