నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలు, ఆయా గ్రామాలలో భారత రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రాహలకు పులమాళలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశంలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, ఎంపిడిఓ రాములు నాయక్, గోపి బాబు,ఎంపిఓ రాజ్ కాంత్ రావు, రాం కిషన్ రావు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm