నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బంజారా సేవాలాల్ నాయకులు సాయి బాబా మందిరం నుండి ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు తమ ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ దుర్గామాత తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆరాధ్య దేవుడి నిర్మించుకున్న గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం పాట్లా ఆందోళన చేపట్టినట్లు వివరించారు.తమకు తెలిసిన సమాచారం ప్రకారం ముస్లిం సోదరులు కూల్చివేసినట్లుగా వారు ఆరోపించారు. అనంతరం బంజారా సేవాలాల్ నాయకులు మోహన్ నాయక్, తుకారం లు మాట్లాడుతూ తాము ముస్లిం సోదరులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తామని ఎంతో ఆరాధ్య దైవంగా అల్లాను కూడా పూజిస్తూ కందూర్లు, పండగలు చేస్తామని వారి పట్ల మాకు ఎలాంటి దురుద్దేశమైన ఆలోచన లేదన్నారు. కానీ ముస్లిం సోదరులు బంజారా సేవలాల్ పైన కక్ష గట్టి అనవసరంగా గద్దెలు కొల్చాడం పట్ల ఆందోళన చెందుతున్నామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బంజారా సేవాలాల్ నాయకులను అదుపులోకి తీసుకురావడానికి నానా తంటాలు పడ్డారు. కానీ వారు శాంతించలేదు. ఎస్పి, డిఎస్పి స్థాయి అధికారులు రావాలంటూ మొండి పట్టు పట్టారు. ఇందల్ వాయి తాహసిల్దార్ టివి రోజా ఆందోళన స్థలానికి చేరుకుని వారిని సముదయించే ప్రయత్నం చేశారు. కానీ వారు నిర్దిష్ట కాలం 24 గంటల్లోపే తమకు జెండాలు గద్దె నిర్మించుకునే అవకాశం కల్పించాలని తాహసిల్దార్ ను కోరారు. తాహసిల్దార్ మాట్లాడుతూ పై అధికారులకు విషయం తెలియజేస్తానని తమకు సమయం ఇవ్వాలని తెలిపారు. పై అధికారుల సూచన మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు శాంతించలేదు. గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. నిజామాబాద్ ఎసిపి వెంకటేశ్వర్లు చేరుకుని ఆందోళన కారులు తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు మోహన్ నాయక్, తుకారం, అంబర్ సింగ్, కుమార్ నాయక్, చందర్ నాయక్, తదితర నాయకులు పాల్గొన్నారు.