నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు టి. హరీష్ రావు ఆధ్వర్యంలో అంతర్జాల మధ్యమం ద్వారా 46 ప్రభుత్వ ఆసుపత్రులలో టిఫా స్కానింగ్ మిషన్లను(గర్భిణీ స్త్రీలలో శిశువు ఎదుగుదల పరిణామక్రమం గుర్తించే యంత్రం) శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తదుపరి జరిగిన వీడియో సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చొరవతో వైద్యరంగంలో అన్ని రకాల వసతులు కల్పించబడి పేదలకు ఉపయోగపడుతుందని, శిశు మరణాల రేటులో జాతీయస్థాయిలో మన తెలంగాణ 3 స్థానంలో ఉన్నదని ఇది గొప్ప విశేషం అని తెలియజేశారు.
ఈ రోజు 46 సెంటర్లలో దాదాపు 20 కోట్ల వ్యయంతో టిపా స్కానింగ్ లను అందించామని, ఈరోజు వాటిని ప్రారంభించామని తెలియజేశారు. ప్రతి 100 మంది గర్భిణీలలో 7% శాతం మంది శిశువు లలో లోపాలను గుర్తించడానికి ఉపయోగిస్తారని, దీని కొరకు ప్రైవేటులో సుమారు 3000 రూపాయలకు ఖర్చు అవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పేదవారి కోసం సదుపాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో జ- సెక్షన్ డెలివరీలో గత సంవత్సరంతో పోలిస్తే 7% శాతం తగ్గినదని, 30% నుంచి 60 %శాతానికి డెలివరీలో పెరిగాయని, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 99% జరుగుతున్నాయని తెలిపారు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని అన్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ లో దండు నీతు కిరణ్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ చేతుల మీదుగా టిఫ్ఫా స్కాన్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడే ఈ టిఫ్ఫా స్కానింగ్ మిషన్లను అందజేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలందరూ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ టిఫ్ఫా స్కానింగ్ మిషన్లు అందజేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకి ఆరోగ్య శాఖ మాత్యులు హరీష్ రావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ స్కానింగ్ ద్వారా గర్భిణీ స్త్రీలలో 18 నుండి 22 వారాలలో శిశువు యొక్క అవయవాల ఎదుగుదలను పరిశీలిస్తారని ఏదైనా లోపం ఉంటే ముందే తెలియజేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేశారు. ఈరోజు ప్రారంభించిన 46 సెంటర్లలో కేవలం 5 సెంటర్లకు మాత్రమే 2 మిషన్లు ఇచ్చారని అందులో మన మన ఆస్పత్రి ఒకటి అని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని నిజామాబాద్ లో గల గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందిరా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నిజామాబాద్, డాక్టర్ నీలిమాసింగ్ గైనకాలజీ విభాగాధిపతి, డాక్టర్ మధుసూదన్ రేడియాలజీ విభాగాధిపతి ఇతర వైద్యులు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:34PM