నవతెలంగాణ - అశ్వారావుపేట
పోడు భూములు సర్వే,పభుత్వ,అటవీ భూముల సంరక్షణలో అటవీ అధికారులకు వారి విధినిర్వహణలో పౌరపోలీస్ అన్ని వేళలా అండగా ఉంటుందని అశ్వారావుపేట సిఐ బి.బాలక్రిష్ణ అటవీ పోలీస్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. శనివారం పౌర పోలీస్ అశ్వారావుపేట సర్కిల్ కార్యాలయంలో దమ్మపేట, అశ్వారావుపేట అటవీ రేంజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ బాలక్రిష్ణ మాట్లాడుతూ అటవీ అధికారులకు వారి రోజువారీ విధి నిర్వహణలో పౌర పోలీస్ సహకారం ఎల్లపుడూ వుంటుందని తెలిపారు. అలాగే పోడు భూములు, అటవీ భూములు పరిరక్షణలో చట్ట బద్దంగా వారు విధులు నిర్వహించే సమయంలో వారికి ఎటువంటి ఆటంకాలు కలిగినా వారికి ఎల్లప్పుడూ తోడ్పాటు వుంటుందని ధైర్యం చెప్పారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట, దమ్మపేట ఎస్.హెచ్.ఒ లు బి.రాజేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డి, ఎఫ్.ఆర్.ఒ లు అబ్దుల్ రహ్మాన్, వెంకట లక్ష్మీ, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:45PM