నవతెలంగాణ-డిచ్ పల్లి
ఆయిల్ ఫామ్ సాగు చేస్తే ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోనే విధంగా చూడాలని నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఎడిఎ వాజిద్ హుస్సేన్, నిజామాబాద్ డివిజన్ ఎడిఎ ప్రదీప్ కుమార్ లు అన్నారు. శనివారం డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట సాగు విదానం, సబ్సిడి వివరాలపై నిజామాబాద్ రూరల్ నీయోజక వర్గంలోని అన్ని మండలాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులకు అయిల్ ఫాం పంటల సాగు చేస్తే ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం - వ్యవసాయ శాఖ నిజామాబాద్ జిల్లా అధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులకు క్రింద తెలిపిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలను, డిడి ఇచ్చి దరఖాస్తు చేయించాలని సూచించారు. ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లేదా 1-బి కాపీ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు రేండు అందజేసే విధంగా చుడలన్నారు. ఆయిల్ పామ్ సాగు కు రాయితిలను ప్రతి ఏటా అందజేయడం జరుగుతుందని వారన్నారు.
డ్రిప్ సేద్యం ద్వారా నీరు అందించుటకు 80% నుండి 100% వరకు రైతు కేటగిరి అనుసరించి రాయితీ యివ్వడం జరుగుతుందని వివరించారు.తోట నాటిన 3 ఏళ్ళ తర్వాత దిగుబడి ప్రారంభమై 25 సంవత్సరాల వరకు కొనసాగుతుందని రైతులకు వివరించారు. మొదటి 3ఏళ్ళ వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ, సొయా,పత్తి, పెసర, మినుములు, శనగ, కుసుమ, పసుపు, జొన్నలు, మక్కలు, సజ్జ, ఎర్ర జొన్నలు, మెట్ట పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చని పేర్కొన్నారు.వరి, చెరుకు పంటను అంతర పంటలుగా సాగు చేయరాదని సూచించారు.మొక్కల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు పైన తెలిపిన జిరాక్స్ పత్ రాలు డిడి లను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఎఈఓ లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అయిల్ ఫాం కంపెనీ ప్రతినిధులు సంధ్యారాణి, గంగాధర్, మండల వ్యవసాయ శాఖ అధికారులు రాంబాబు, ప్రవీణ్ కుమార్, వేంకటేష్, దేవిక, హిరా జాదవ్, రవిందర్, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:54PM