- మూడవ స్థానంలో నిలిచిన అఖిల్
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఇల్లందు సింగరేణి పాఠశాలలో నిర్వహించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సీనియర్స్ విభాగంలో వి.అఖల్ 3వ స్థానం పొందాడు. ఈ ప్రదర్శనలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, గురుకులాలు పాల్గొన్నాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు గైడు గా వ్యవరించారు. సైన్స్ ఉపాద్యాయులు పి.రాంబాబు, యం.మధుసూధనరావు, కె.అప్పారావు, జి.వి.ఆర్ ప్రసాద్, ఆర్.విష్ణుప్రియ సహకరించారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm