- జమ్మికుంట రూరల్ సీఐ జవ్వాజి సురేష్
నవతెలంగాణ-వీణవంక
రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జమ్మికుంట రూరల్ సీఐ జవ్వాజి సురేష్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన వివిధ సీడ్ కంపెనీల డీలర్లతో స్థానిక లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ లో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట రూలర్ సీఐ సురేష్ హాజరై మాట్లాడుతూ వ్యవసాయ శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. సీడ్ కంపెనీ డీలర్లు గుర్తింపు పొందిన సీడ్స్ కంపెనిల నుండి తీసుకువచ్చిన పాడి మొక్కజొన్న నాణ్యత కలిగిన విత్తనాలను మాత్రమే రైతులకు ఇవ్వాలి. సీడ్ కంపెనీ యాజమాన్యులు డీలర్లు రైతుల నుండి ఎలా అగ్రిమెంట్ తీసుకుంటారో అలాగే రైతులకు కూడా సంబంధిత కంపెనీ నుండి డీలర్లు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా రైతులను ఇవ్వరు మోసం చేసిన వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని సూచించారు. రైతులను ఇవ్వరు మోసం చేయవద్దని చెప్పారు. ఆరుగాల పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు పంట పండించడం జరుగుతుందన్నారు. కానీ కొంతమంది గుర్తింపు లేని సీడ్ కంపెనీల పేర్లు చెప్పుకొని దళారులు రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి తర్వాత డబ్బుల విషయంలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. మనలో చాలామంది రైతులు మోసపోవడం జరుగుతుందని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మండలలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన కొమురయ్యకు అదే గ్రామానికి చెందిన సీక్ డీలర్ ధాన్యం డబ్బులు 4 లక్షల రూపాయలు ఇవ్వకుండా సంవత్సరం నుండి తన చుట్టూ తింపుకోవడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వని వారిని సీడ్ డీలర్లను యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులు గుర్తింపు పొందిన కంపెనీల సీడ్ మాత్రమే పెట్టాలి నేను యెడల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రైతులను ఎవరు మోసం చేసిన వారిపై పిడిఎఫ్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వీణవంక ఎస్సై శేఖర్, ఏఓ గణేష్, పోలీస్ సిబ్బంది రాజబాబు, పాషా, రమేష్, సీడ్ కంపెనీల డీలర్లు నల్ల తిరుపతిరెడ్డి, దేవేందర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, కొమురయ్య, అన్ని గ్రామాల డీలర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:59PM