నవతెలంగాణ-డిచ్ పల్లి
ఆర్మూర్ మండలంలో ఉన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సులో విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థులకు జాతీయ రహదారి 44 పై తృటిలో పేను ప్రమాదం తప్పింది. ఆర్మూర్ లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో శనివారం ఉదయం బస్సులు హైదరాబాద్ కు విహార యాత్రకు వెళ్తున్నారు. ఇంతలో డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ ఎదుట 44 వ జాతీయ రహదారిపై డిసిఎం వ్యాన్ కు ఢీ కొట్టినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. బస్సు ముందర ఒకవైపు అద్దాలు పగిలిపోయాయని విద్యార్థులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ ఐ తెలిపారు. కానీ తృటిలో పేను ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm