నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు పోడు భూములు ఉన్న గ్రామపంచాయతీలో అధికారికంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ఏళ్ల తరబడి దుక్కులు దున్ని భూములను సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు పత్రాలు అందజేసేందుకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నారు. మద్నూర్ మండలంలోని షేఖాపూర్ గ్రామంలో శనివారం నాడు ఆ గ్రామ సర్పంచ్ ఎంకే పటేల్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణంలో ఫారెస్ట్ కమిటీ చైర్మన్ అక్తార్ పటేల్ గ్రామ పంచాయితీ ఉపసర్పంచ్ గౌతమ్, గ్రామపంచాయతీ కార్యదర్శి భరత్ రెడ్డి, ఫారెస్ట్ కమిటీ కార్యదర్శి ఈ ఐదుగురు సభ్యుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు ప్రభుత్వం నుండి అందడానికి వాంగ్మూలం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ ఎంకే పటేల్ విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 08:08PM