నవతెలంగాణ-వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామ పరిధిలో కరీంనగర్-జమ్మికుంట రోడ్డుపై ఉన్న హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కారు-బైక్ ఢీ కొన్నాయి. ఘన్ముకుల గ్రామానికి చెందిన బొంగోని అఖిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ రాజబాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలించి. క్షత గాత్రుడిని చికిత్స నిమిత్తం దావఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm