నవతెలంగాణ-పెద్దవూర
హైద్రాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆదివారం జరుగుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) 2వ రాష్ట్ర మహాసభలకు నాగార్జున సాగర్ నియోజకవర్గము నుంచి జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షుడు మూల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విలేఖరికి అక్రిడియేషన్ కార్డు, ఆరోగ్య బీమా, సొంత ఇల్లు కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాటు పడుతోందని గుర్తుచేశారు. కార్పొరేట్ల కబంధ హస్తాలలో మీడియా చిక్కుకున్న నేపథ్యంలో జర్నలిస్టులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతున్నందుకు జర్నలిస్టులపై దాడులు బెదిరింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు తలెత్తినా జర్నలిస్టలు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీడబ్ల్యూజేఎఫ్ పని చేస్తోందని చెప్పారు. ఇండ్ల స్థలాలు, అక్రిడియేషన్లు, హెల్త్ కార్డులు, బస్సు, రైల్వే పాసులు తదితర సమస్యలపై హైదరాబాద్ లో నిర్వహించే సభలో చర్చించ నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నామలింగయ్య, కార్యవర్గ సభ్యులునడ్డి శివకృష్ణ, షేక్ ఇబ్రహీం, హరీష్, రామయ్య, రమణ హరికృష్ణ, శ్రీధర్ రెడ్డి తదితరులు వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 12:48PM