నవతెలంగాణ-కంటేశ్వర్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి రాజు గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా రెండవ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో కూడిన నూతన జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఆదేశాలతో ఆదివారం విలేకరులకు అధికారికంగా నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గొల్లపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ తన పైన నమ్మకంతోజిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా కమిటీ సభ్యులకు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండా సురేందర్ రెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి తేజ్ దీప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమ సమాజ స్థాపన కోసం, నేతాజీ మార్గంలో భారత దేశ పునర్నిర్మానానికై, జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. 2014 నుండి నేటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని. గత సార్వత్రిక ఎన్నికలు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలో దింపి ప్రజా గొంతుకను వినిపించడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో వివిధ ప్రజాసంఘాల నిర్మాణంతో పాటు పార్టీని బలమైన శక్తిగా తయారు చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 03:28PM