నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ నూతనంగా వచ్చిన డి ఈ పులుసు నాగేశ్వరరావును తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపిటిసి దానక నరసింహారావు, వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుర్గ వీరబాబు, గంగారం సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వరరావు, ఎల్లబోయిన ఝాన్సీ రాంబాబు, నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నర్సింహా స్వామి, పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బందెల వెంకటేశ్వర్లు, మాల మహానాడు సంఘం నాయకులు బందెల సమ్మయ్య పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తాడ్వాయి మండల, తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి మా జిల్లాకు ఎంపీడీసీఎల్ డిఈ గా రావడం మాకు గర్వకారణంగా ఉందని అన్నారు. స్థానికంగా ఉన్న కొన్ని విద్యుత్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డి ఈ పులుసు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యుత్ సంబంధించిన ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని, కొన్ని విద్యుత్ సమస్యల్లో ప్రజా ప్రతినిధుల, ప్రజలు, అధికారుల అందరికీ సహాయ సహకారాలు కూడా ఉండాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 04:07PM