న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని థానేలో ఓ యోగా శిబిరంలో రాందేవ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మహిళలు చీరకట్టులో, సల్వార్ సూట్స్‌లో అందంగా ఉంటారని, వారు ఏం ధరించకపోయినా బాగుంటారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర తీవ్రంగా ఖండించారు. 2011లో మహిళ వేషంలో రాందేవ్ బాబా రాంలీలా మైదానం నుంచి ఎందుకు పారిపోయారో ఇప్పుడు తనకు తెలిసిందని, ఆయన తనకు శారీలు, సల్వార్‌లు ఇష్టమని చెబుతున్నారని ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ ద్వారారు మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm