నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏదుల్ మియా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏదుల్ మియా మృతికి గల వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, ఉప సర్పంచ్ బిక్షపతి, టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగపు మండల అధ్యక్షుడు బుర్రి రంజిత్ వర్మ, సోసైటి వైస్ చైర్మన్ స్వామి, ఎంపీటీసీ లీలావతి బాలా గౌడ్, కర్నాల మల్లేశం, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అమరావతి సిద్ధిరామిరెడ్డి పెద్ద ఎత్తున గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm