- సిబి రామారావు
నవతెలంగాణ-ధర్మసాగర్
ఆదివారం జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు మండలంలోని విలీన గ్రామమైన ఉనికిచర్ల గ్రామంలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో ఆచార్య దురికే కాశీనాథ్ అధ్యక్షతన ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వైజ్ఞానిక సదస్సు లో శాస్త్ర సాంకేతిక రంగం సవాళ్లుఁ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా ప్రపంచ యావత్తు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రకాల శాస్త్రాలు అవి వైద్యమైన, యంత్ర విద్య అయిన, సామాజిక శాస్త్రాలైన, భాషా శాస్త్రాలైన వాటికి సైన్సే మూలం అన్నారు. మరో వక్త జువాలజీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాములు మాట్లాడుతు సైన్స్ పద్ధతిలో జీవిస్తు కార్యాకారక సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లాలోని 14 మండలాలను నుండి జిల్లా స్థాయి చెకుముకి సంబరాలకు ఎంపికైన ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమం విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి మొదటగా రాత క్విజ్ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత స్టేజి క్విజ్ నిర్వహించడం జరిగింది. ఆచార్య ఆంజనేయులు, ధర్మ ప్రకాష్, సుమలత, కుమారస్వామి, దయాకర్, క్విజ్ మాస్టర్లు గా వ్యవహరించి డైరెక్ట్ రౌండ్, ఎక్సపరిమెంటల్, విజువల్, క్రియేటివ్ రౌండ్స్ నిర్వహించారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఆంగ్ల మధ్య ప్రైవేటు పాఠశాలల విభాగంలో తెలుగు మాధ్యమం ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రధములుగా నిలిచి రాష్ట్రస్థాయి చెకుమికి సంబరాలకు ఎన్నికయ్యారు. విజేతలందరికీ బహుమతులు అందజేశారు. జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణుఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో, పాఠశాల ప్రిన్సిపాల్, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు భద్రయ్య, ఉమామహేశ్వర్, గోపాల్, శ్రీనివాస్, బిక్షపతి, రామాంజనేయులు, , వి.శ్రీనివాస్, గౌస్ పాషా, ప్రసన్నకుమార్, సోమయ్య, వందన మొగిలి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 05:14PM