నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో 44వ జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా ప్రతిష్టించనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజను రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన రోజున ఆయన విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, ఎంపీటీసీ లీలావతి బాలా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ మద్ది స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగపు అధ్యక్షుడు బుర్రి రంజిత్ వర్మ, నాయకులు కార్నల మల్లేశం, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అమరావతి సిద్ధిరామిరెడ్డి, అటవీ సంరక్షణ సమితి అధ్యక్షుడు గౌరీగారి రాజిరెడ్డి, సముద్రాల రాజు, అంబేద్కర్ సంఘ నాయకులు శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 05:17PM