-వైఎస్ఆర్ టిపి రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి
నవతెలంగాణ -డిచ్ పల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలను, విస్మరించి ప్రజలను మభ్యపెడుతున్నారని
వైఎస్ఆర్ టిపి నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో, వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆదివారం
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, 3500 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా, పార్టీ అధిష్టానం పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేక్ కట్ చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం సుమారు 100 మందిని వివిధ పార్టీల కార్యకర్తలను వైయస్సార్ తెలంగాణ పార్టీ లో కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ,, మతతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పిలుపునివ్వడం జరుగుతుందని, ముఖ్యంగా షర్మిల ప్రశ్నించే గొంతుకై, గత సంవత్సర కాలముగా పాదయాత్ర చేస్తూ, మోడీ, కెసిఆర్ ల అవినీతి పరిపాలన గురించి చెబుతూ, ప్రజలతో మమేకమై మళ్ళీ రాజన్న రాజ్యం కొరకు పరితపిస్తూ ముందుకు సాగుతున్నరన్నారు. ప్రజలకు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల అభివృద్ధి కొరకు పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలోవైయస్ అర్ పి తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ తో పాటు, జక్రాన్ పల్లి మండలా ఇంచార్జ్ రాజు, రూరల్ మండలం ఇంచార్జ్ రాజశేఖర్, సంజయ్ రెడ్డి, డిచ్ పల్లి వైయస్సార్ టిపి తెలంగాణ పార్టీ ఎస్టిసెల్ ప్రెసిడెంట్ లవ కుమార్, మసూద్, అహ్మద్, ముజాహిద్, సురేష్, అవినాష్, సంతోష్, శివానంద, లతా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Nov,2022 05:21PM