నవతెలంగాణ-తాడ్వాయి
మండల కేంద్రంలో ఈ నెల 29న ఎల్లుండి మంగళవారం అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఎన్నిక నిర్వహించనున్నట్లు అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సల్లూరి లక్ష్మయ్య, జిల్లా నాయకుడు బండారి చంద్రయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నిక కార్యక్రమానికి మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలలో గల దళితులు, ఉద్యోగులు, యువకులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా హాజరుకావాలని కోరారు. దీనితోపాటు ఈ ప్రాంతంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దళితులు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm